‌Huzurabad: బహిరంగ సభలకు ఈసీ బ్రేక్.. సీఎం కేసీఆర్ సభ లేనట్టే

‌Huzurabad:పక్క జిల్లాలకూ కోడ్ అమలు * సీఎం కేసీఆర్ సభ లేనట్టే

Update: 2021-10-22 05:12 GMT

హుజురాబాద్ టీఆర్ఎస్ బహిరంగ సభకు ఈసీ బ్రేక్ (ఫైల్ ఇమేజ్)

‌Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో బహిరంగ సభలకు ఈసీ బ్రేక్ వేసింది. పక్క జిల్లాల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపింది. దీంతో గులాబీ బాస్ సభ ఇక లేనట్టే అన్పిస్తుంది. ఇదిలా ఉంటే రోడ్ షోలకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ప్లీనరీని హుజూరాబాద్‌ సభగా వాడుకునే అవకాశం ఉంది. ఇక సభలపై నిషేదమంతా బీజేపీ కుట్ర అని విమర్శిస్తోంది టీఆర్ఎస్. కరీంనగర్, హన్మకొండ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఇక్కడ భారీ బహిరంగసభలు నిర్వహించడానికి వీల్లేదని తెలిపింది ఈసీ. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ ప్రచారం రోడ్‌షోలకే పరిమితం కానుంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పొలిటికల్ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కాంగ్రెస్ పోటీలో ఉన్న ప్రధాన పోటీ టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీల మధ్య అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో రెండు పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళ హుజురాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ముమ్మర ప్రచారంతో ధూమ్‌ధామ్ చేస్తున్నారు. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్, తలసాని శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్.

Full View


Tags:    

Similar News