Malreddy Rangareddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు

Malreddy Rangareddy: ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

Update: 2023-11-14 13:28 GMT

Malreddy Rangareddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు

Malreddy Rangareddy: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి అబ్దుల్లాపూర్‌ మెట్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈసారి ఎన్నికలు బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు అని ఆయన అన్నారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని రంగారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. పేద ప్రజల భూములు కూడా లాక్కున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News