Bhatti Vikramarka: హోరెత్తిన..'భట్టి' ప్రచారం

Bhatti Vikramarka: మంగళహారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు

Update: 2023-11-18 13:39 GMT

Bhatti Vikramarka: హోరెత్తిన..'భట్టి' ప్రచారం

Bhatti Vikramarka: భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు, ర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ, విజయవాడ సిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మద్దతు ప్రకటించారు. ఖానాపురం గ్రామంలో భట్టి ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. మహిళలు అడుగడుగునా మంగళహారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పది సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు సెక్రటేరియట్‌కు రాలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు.

కేసీఆర్‌కు ప్రజలు ముఖ్యం కాదని, ధరణి లాంటి కుంభకోణ పథకాలే ముఖ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు పసుపులేటి నాసరయ్య, నాయకులు రాజయ్య కొత్తపల్లి రాణి, బ్రహ్మం, శ్రీను, వల్లాల వెంకటేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు... వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి భట్టి విక్రమార్క ఆహ్వానించారు.

Tags:    

Similar News