ED Special Focus: తెలంగాణలో సోషల్ మీడియాపై ఈసీ స్పెషల్ ఫోకస్
ED Special Focus: సోషల్ మీడియాను మానిటరింగ్ చేస్తున్న ఎన్నికల కమిషన్
ED Special Focus: తెలంగాణలో సోషల్ మీడియాపై ఈసీ నజర్ పెట్టింది. 22 ఏజెన్సీలతో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టింది ఎన్నికల కమిషన్. సోషల్ మీడియాను మానిటరింగ్ చేస్తున్న ఈసీ.. రాజకీయ, ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్లపై దృష్టి సారించింది. వీడియో క్లిప్పులు, సోషల్ మీడియాలో పార్టీల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. అలాగే.. మద్యం, హవాలా డబ్బు రవాణాపై కూడా ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఈసీ.