చైనీస్ స్మార్ట్ ఫోన్‌ల తయారీ కంపెనీల ఆఫీస్‌లపై ఈడీ దాడులు
*బంజారాహిల్స్ కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు
ED Raids: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో వరుస దాడులు చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ బంజారాహిల్స్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈడీ దాడులు చేస్తున్న లిస్టులో చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఉండటం గమనార్హం. ఓపో ప్రధాన కార్యాలయాలపై ఈడీ సోదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ఉల్లంఘనలపై ఫైనాన్షియల్ వాచ్‌డాగ్ ముమ్మర దర్యాప్తు చేస్తుంది.
అయితే చైనా మొబైల్ కంపెనీలతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కలిగిన 44 సంస్థలలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. వివో, ఒప్పోతో పాటు అనుబంధ కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఈడీ ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద షియామికి చెందిన ఆస్తులను అటాచ్ కూడా చేసింది ఈడీ. ఏడాది కాలంగా లావాదేవీలు, సర్వర్ వంటి అంశాలపై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది.