ED Raids: ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు
ED Raids: ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి.
ED Raids: ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. దాదాపు 17 గంటల పాటు ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అర్థరాత్రి వరకు సాగిన ఈడీ సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఖమ్మం, హైదరాబాద్‌లో మొత్తం ఆరు చోట్ల సోదాలు చేసిన ఈడీ, కీలక డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని నామా నివాసంలో భారీగా నగదు గుర్తించినట్లు తెలుస్తుంది.
జార్ఖండ్‌లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. ఈ అంశంపై 2019లోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, 2020లో చార్జిషీటు దాఖలు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా తనిఖీలు నిర్వహించింది.