తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ప్రత్యేక దృష్టి
Telangana: రాష్ట్ర వ్యాప్తంగా 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు
Telangana: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 10వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు... గ్రేటర్ హైదరాబాద్‌లో 18వందల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో ఐదెంచల సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు . 500కు పైగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.