Corona Effect: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

Corona Effect: దేశంలో క‌రోనా రెండోద‌శ‌ మ‌హోగ్ర‌రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-05-13 14:11 GMT

EC

Corona Effect: దేశంలో క‌రోనా రెండోద‌శ‌ మ‌హోగ్ర‌రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. మే 31తో ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీలకు, జూన్ 3తో తెలంగాణలోని ఆరుగురు ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగియనుంది.

దాంతో ఆయా స్థానాలు ఖాళీ కానున్నాయి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా పరిస్థితులు కుదుటపడిన తర్వాతే ఎన్నికల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది.

ఇటీవ‌లే ఐదు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు, ఏపీలోని తిరుప‌తి పార్లమెంట్, తెలంగాణ‌లోని సాగ‌ర్ అసెంబ్లీ స్థానాల‌కు ఉపఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల త‌ర్వాత దేశంలో క‌రో్నా వ్యాప్తి పెరిగింద‌ని మద్రాస్ హైకోర్టు అభిప్రాయ‌పడిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల సంఘానికి చివాట్లు కూడా పెట్టింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా సెంక‌డ్ వేవ్ తీవ్ర‌రూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్ర‌ళ‌యం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గ‌డ‌చిన 24 గంటల్లో ఏకంగా 22,399 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇదే సమయంలో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,63,890 కేసులు నమోదు కాగా..11,53,771 మంది కోలుకున్నారు. మ‌రో 9,077 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృతి చెందారు

తెలంగాణ‌లో గడిచిన 24 గంటల్లో 4వేల693 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,16,404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో 33 మంది కరోనాతో మరణించారు.

Tags:    

Similar News