EAMCET: తొలిరోజు సజావుగా ఎంసెట్‌ పరీక్షలు

* ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ * ఈ నెల 6 వరకు ఇంజినీరింగ్, 9, 10 తేదీల్లో మెడిసిన్ పరీక్షలు

Update: 2021-08-05 02:21 GMT

తొలిరోజు సజావుగా ఎంసెట్‌ పరీక్షలు (ఫైల్ ఫోటో)

EAMCET Exam: తొలిరోజు ఎంసెట్‌ పరీక్షలు సజావుగా జరిగాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించ లేదు. కంప్యూటర్ బేస్డ్ విధానం ద్వారా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పరీక్షను నిర్వహించారు. ఈ నెల 6 వరకు ఇంజినీరింగ్, 9, 10 తేదీల్లో మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలను నిర్వహించనున్నారు. బిట్ శాట్ రాస్తున్న 1,500 మందికి ఎంసెట్ పరీక్ష సమయాన్ని రీషెడ్యూల్ చేశారు.

మొదటి సెషన్‌లో తెలంగాణలో 21వేల 8వందల 1 మంది అభ్యర్థులకు 20,363 మంది విద్యార్థులు అంటెండ్‌ అయ్యారు. ఏపీలో 5వేల 6వందల 55 మంది అప్లై చేసుకొని 4,718 మంది పరీక్షకు హాజరు అయ్యారు. ఇక మధ్యాహ్నా సెషన్‌లో 21వేల 9వందల 78 మందికి గాను 20వేల 446 మంది పరీక్షలు రాశారు. ఏపీలో 5వేల 5వందల 49 మందికి గాను 4వేల 6వందల 8 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తంగా 54వేల 9వందల 83 మందికి 50వేల 134 మంది పరీక్ష రాశారు. 

Tags:    

Similar News