Raghunandan Rao: ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే.. కేసులు పెట్టడమేంటి?
Raghunandan Rao: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ, కేసు విషయాలు అడిగితే చెప్పరా?
Raghunandan Rao: పోలీసులు చర్యలు తీసుకునే విషయంలో పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిముందు ఆందోళనకు బయలుదేరిన వారిని అరెస్టు చేయడాన్ని రఘునందన్ తప్పుబట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చిన ఆయన పోలీసులను కేసుల వివరాలు అడిగి విస్తుపోయారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు.. వివరాలివ్వరా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేశారని ఫిర్యాదుచేస్తే... చర్యలు తీసుకోరని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపితే అక్రమకేసులు పెడ్తారేంటని ప్రశ్నించారు.