Drunk and Drive: హైటెన్షన్ విద్యుత్ వైర్లపై నడిచి టెన్షన్ పెట్టిన వ్యక్తి
Drunk and Drive: హైటెన్షన్ వైరు విద్యుత్ వైర్లు ఎక్కిన ఓ వ్యక్తి హైటెన్షన్ క్రియేట్ చేసి పోలీసులకు చెమటలు పట్టించాడు.
Drunk and Drive: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సైబరాబాద్ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వుంటారు. ఈ నేపధ్యంలో పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కొరడా ఝళిపిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డవారికి జరిమానాలు విధించడమే కాకుండా.. వారిని కోర్టులో హాజరపరుస్తున్న విషయం తెలిసిందే.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తి ఏకంగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఎక్కి పోలీసులకు హైటెన్షన్ క్రియేట్ చేశాడు. ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అది కూడా ఉదయం పూట కావడం విశేషం. ఈ ఘటన షాద్ నగర్‌లో చోటుచేసుకుంది.
షాద్‌నగర్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు ఓ వ్యక్తి మద్యం తాగి బైక్ నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తి బైక్‌ను సీజ్ చేశారు షాద్‌నగర్ పోలీసులు. దీంతో అతడు హైటెన్షన్ వైర్లపైకి వెళ్లిపోయాడు. హైటెన్షన్ వైర్ల వెళ్లే పోల్ ఎక్కేసి.. వైర్లపై నడవడం ప్రారంభించాడు. అయితే ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అతడు వైర్లపై నడుస్తున్న సమయంలో వైర్లు ఊయల లాగా ఉగాయి. దీంతో అక్కడున్న వారంతా అతడు కిందపడిపోతాడేమనని ఆందోళన చెందారు దీంతో ఆ ప్రాంతంలోభారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సదరు వ్యక్తికి నచ్చచెప్పి కిందకు దించేందుకు పోలీసులు నానాఅవస్తలు పడుతున్నారు.