Siricilla: సిరిసిల్ల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ప్రారంభానికి సిద్ధం

Siricilla: వేయి 320 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి * రేపు సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ

Update: 2021-07-03 03:13 GMT

డబల్ బెడ్రోమ్ ఇల్లు (ఫైల్ ఇమేజ్)

Siricilla: సిరిసిల్లలో అర్హులైన వేయి 320 మందికి సొంతింటి కల సాకారం కాబోతుంది. రేపు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్‌ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయంగా మోటారు డ్రైవింగ్‌లో ఉపాధి పొందాలనుకునే యువతకు ప్రభుత్వం నిర్మించిన ఐడీటీఆర్‌ను కూడా కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో సిరిసిల్లలోని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను సర్కార్‌ నిర్మించింది. 26 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్‌ టు పద్ధతిలో కట్టారు. గేటెడ్‌ కమ్యూనిటీకి తీసిపోని విధంగా ఇళ్లను నిర్మించారు. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచేలా ఆట వస్తువులతో ఉద్యానాలు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేశారు.

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం 2017లో ప్రారంభంకాగా ఏడాది క్రితమే పూర్తయ్యింది. పారిశుద్ధ్యం, మౌలిక వసతులతోపాటు ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు అందించే పైపులను ఏర్పాటు చేశారు. ఇంటి కరెంటు వినియోగానికి గాను తీగలను వేలాడదీయకుండా ప్రధాన స్తంభం నుండి భూగర్భ తీగల ద్వారా నేరుగా బ్లాకులకు అమర్చారు.

Full View


Tags:    

Similar News