Redya Nayak: మీకు, సిగ్గు, శరం ఉంటే నాకే ఓటెయ్యాలి

Redya Nayak: డోర్నకల్ MLA రెడ్యానాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2023-11-12 03:33 GMT

 Redya Nayak: మీకు, సిగ్గు, శరం ఉంటే నాకే ఓటెయ్యాలి

Redya Nayak: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ MLA రెడ్యానాయక్ ఓటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీకు సిగ్గూ, శరం ఉంటే నాకే ఓటెయ్యాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ప్రచారం నిర్వహించారు. స్థానిక నేతనైన తనను వదిలేసి సూర్యాపేట నుండి వలసవచ్చిన వానికి ఓట్లెలా వేస్తారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేసిన తనకే ఓటు వేయాలని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. MLA రెడ్యానాయక్ వ్యాఖ్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతో ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు.

Tags:    

Similar News