గాంధీ ఆస్పత్రిలో అమానవీయ ఘటన.. బోల్ట్స్ లేవంటూ 25 రోజులుగా ఆపరేషన్ చేయని డాక్టర్లు...
Gandhi Hospital: 25 రోజులు క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన 14 ఏళ్ల అక్షయ...
Gandhi Hospital: హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు తీరు మరోసారి వివాదాస్పదం అవుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ బాలికకు ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వైనం ఆసల్యంగా వెలుగులోకొచ్చింది. ఆపరేషన్ థియేటర్ వరకు తీసుకెళ్లిన డాక్టర్లు.. బోల్ట్స్ లేవంటూ వెనక్కి పంపేశారు. దీంతో గత 25 రోజులుగా ఇటు కూర్చోలేక, అటు నిల్చోలేక అక్షయ నరకయాతన అనుభవిస్తోంది. తీరు వివాదాస్పదంగా మారింది.
తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు చనిపోగా.. ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్షయ అనేయువతి మాత్రం హైదరాబాద్ గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. త్వరలో తాను కోలుకుంటానని ఆశతో ఎదురుచూస్తున్నప్పటికీ.. వెన్నుపూస ఆపరేషన్ చేయకుండా 25 రోజులుగా గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తనకు నయం కాక.. అటు తమ బంధువులు బతికున్నారో లేదో తెలియని స్థితిలో ఈ యుతి అనుభవిస్తున్న నరకయాతన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.