సీఎం కేసీఆర్ ని అభినందిస్తూ స్టాలిన్ లేఖ!
MK Stalin Wrote Letters : ఇటీవల ముగిసిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన రుణాలు ఎంపికలను అంగీకరించడానికి నిరాకరించిన 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్ గురువారం లేఖలు రాశారు .
MK Stalin Wrote Letters : ఇటీవల ముగిసిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన రుణాలు ఎంపికలను అంగీకరించడానికి నిరాకరించిన 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్ గురువారం లేఖలు రాశారు . ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌ఘర్, రాజస్థాన్, ఢిల్లీ,జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు. ఈ లేఖలో అయన జీఎస్టీ విషయంలో కేంద్రం, పలు రాష్ట్రాల ప్రయోజనాలను వమ్ము చేస్తోందని, కేంద్రం నిర్ణయాలను అడ్డుకుంటున్నందుకు తమిళ ప్రజలు ఈ రాష్ట్రాలను అభినందిస్తున్నట్టుగా అయన ఆ లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా మా స్వంత తమిళనాడు ప్రభుత్వం తన ప్రజలకు ద్రోహం చేస్తూనే ఉన్నప్పటికీ గట్టిగా నిలబడాలని మిమ్మల్ని కోరుతున్నాను అయన ఆ లేఖలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి రూ. 47,272 కోట్ల జీఎస్టీ పరిహారం రావాల్సి వుందని కాగ్ వెల్లడించిన రిపోర్టును ప్రస్తావించిన ఆయన, ఈ నిధులను వెంటనే చెల్లించేలా కేంద్రంపై ఒత్తిడిని పెంచాలని సలహా ఇచ్చారు.
ఇక ఇది ఇలా ఉంటే కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణానికి ఎంకె స్టాలిన్ గురువారం సంతాపం తెలిపారు. "సామాజిక న్యాయం యొక్క స్తంభం ఈ రోజు పడిపోయింది. పార్లమెంటులో అణగారిన ప్రజల గొంతు మౌనంగా ఉంది" అని ఆయన అన్నారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన కాలంలో తమిళనాడు కోసం వివిధ ప్రాజెక్టులను విలాస్ పాస్వాన్ మంజూరు చేసినట్లు స్టాలిన్ తన సంతాప సందేశంలో తెలియజేశారు.