DK Aruna: రేవంత నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న డీకే అరుణ

DK Aruna: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని ప్రశ్నించిన డీకే అరుణ

Update: 2024-04-20 07:14 GMT

DK Aruna: రేవంత నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న డీకే అరుణ

DK Aruna: ఒక మహిళనని కూడా చూడకుండా సిఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. ఒక ఆడ బిడ్డను ఓడించేందుకు రాక్షసులుగా, రాబందులగా నోటికి వచ్చినట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ఆగస్టు 15 లోపు నెరవేర్చక పోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు. పాలమూడు ఆడబిడ్డపై రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి ప్రతిపాలమూరు ఆడబిడ్డా ఆలోచించాలన్నారు.

Tags:    

Similar News