DK Aruna: జైలుకి వెళితే అవినీతిపై వెళతారు.. ప్రజలకోసం పోరాటమని చెప్పడం విడ్డూరం
DK Aruna: తప్పుచేయనప్పుడు ఈడీ, సీబీఐ వచ్చినా భయమెందుకు
DK Aruna: టీఆర్ఎస్ చేసిన తప్పులు బయట పడతాయనే ముందే బీజేపీపై ఎదురు దాడి ప్రారంభించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ ప్రజల నుంచి సానుభూతి పొందడానికి కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తుందన్న అరుణ.. ఎటువంటి తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ వచ్చినా భయం ఎందుకు అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళితే చేసిన అవినీతి వల్ల వెళ్లినట్లే కానీ., అదేదో ప్రజల కోసం పోరాటం చేసి జైలుకి వెళ్లడానికి సిద్ధం అన్నట్లుగా మాట్లాడటం.. విడ్డూరం అని ఎద్దేవా చేశారు.