Telangana: ఏప్రిల్ 30 తర్వాత ఏం చేద్దాం? సీఎంవో వర్గాల్లో విస్తృత చర్చ
Telangana: మినీ లాక్‌డౌన్ విధించడం..? పూర్తి లాక్‌డౌన్ అమలు చేయడమా..?
Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్రంలో అమలవుతున్న నైట్ కర్ఫ్యూ ఈ నెల 30తో ముగుస్తోంది. మరి.. 30వ తారీఖు తర్వాత ఏం చేయాలనేదానిపై సీఎంవో వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి మూడు అస్త్రాలను అన్వేషిస్తోంది టీఎస్ సర్కార్. అందులో ఒకటి నైట్ కర్ఫ్యూను కొనసాగించడమా..? లేక మినీ లాక్‌డౌన్ విధించడమా..? మొత్తం రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ అమలు చేయాలా..? అనేదానిపై విస్తృతంగా చర్చిస్తున్నారు అధికారులు.