వీల్‌చైర్‌లో గాంధీభవన్‌కు వచ్చిన డి.శ్రీనివాస్
* ఠాక్రే, రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న డి.శ్రీనివాస్
Dharmapuri Srinivas: గాంధీభవన్‌కు చేరుకున్నారు డి.శ్రీనివాస్. ఇక.. కాసేపట్లో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీల్‌చైర్‌లో గాంధీభవన్‌కు వచ్చిన డి.శ్రీనివాస్... ఠాక్రే, రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. చేరిక అనంతరం కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొననున్నారు. రాహుల్‌కు మద్దతు ఇచ్చేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నానని అన్నారు డి.శ్రీనివాస్. రాహుల్ ఊహించిన దానికంటే గొప్పగా పనిచేస్తున్నారన్న డి.శ్రీనివాస్.... రాహుల్‌పై అనర్హత వేటు వేసేవారికి అసలు అర్హత ఉందా..? అంటూ ప్రశ్నించారు.