Dharmapuri Arvind: తెలంగాణకు నేనే పసుపు బోర్డు తెచ్చా.. షుగర్ ఫ్యాక్టరీ కూడా నేనే తెరిపిస్తా
Dharmapuri Arvind: ఈసారి కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించండి
Dharmapuri Arvind: నిజామాబాద్ జిల్లాకు నేనే పసుపు బోర్డు తెచ్చానని చెబుతూ... షుగర్ ఫ్యాక్టరీ కూడా నేనే తెరిపిస్తానని నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కల్వకుంట్ల అనేది మనకు పట్టిన శని అని, ఈసారి ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే కేవలం రెండు వేల పింఛన్ మాత్రమే వస్తుందని, బీజేపీకి ఓటేస్తే నాలుగు వేల పింఛన్ ఇస్తామని చెప్పారాయన... కేసీఆర్కు ఓటేస్తే నీళ్లు రావని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాడని చెప్పారు. తాను ఈ ఎన్నికల్లో గెలిచిన వారం రోజుల్లో మహిళా సంఘ భవన నిర్మాణానికి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు అర్వింద్.