Dhanpal: బీజేపీ మేనిఫెస్టో వచ్చాక ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
Dhanpal: మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయి
Dhanpal: నిజామాబాదు నగరంలో బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. నగరం లో BRS, కాంగ్రెస్ అభ్యర్తులు లోకల్ వారు కాదన్నారు. నగరంలో అభివృద్ధి శూన్యం అని పరాయి వాళ్ళ పెత్తనం మనకెందుకు అని ప్రశ్నించారు. నగరంలో ఎన్నో సంవత్సరాలనుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో దేవాలయాల అభివృద్ధి కి సహకరించాను అని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయి అన్నారు.
రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందని.. కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ కి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీ తో గెలిపించాలని అన్నారు. బీజేపీ మేనిఫెస్టో వచ్చాక ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. ఈ సారి బీజేపీ అభ్యర్థులని గెలిపిస్తామనే నమ్మకం ప్రజల్లో కల్గింది అన్నారు.