తెలంగాణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం చేయూత.. రూ. 15 కోట్ల విరాళం

Update: 2020-10-20 07:42 GMT

ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ న‌గరాన్ని భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తిన విష‌యం తెలిసిందే. దీంతో నగరంలోని పలు కాలనీలు జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకుకోవడంతో నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో ఇండ్లన్నీ వరదలో మునిగిపోయి కొన్ని ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు త‌క్ష‌ణ సాయం కింద రూ. 550 కోట్లు విడుద‌ల చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రజలకు అండ‌గా నిలుస్తున్నాయి.

ఇందులో భాగంగానే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్లు విరాళం ఇవ్వగా తాజాగా ఢిల్లీ ప్ర‌భుత్వం కూడా తెలంగాణ ప్రజలకు ఆదుకునేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. మంగళవారం కేజ్రీవాల్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని వెల్లడించారు. రూ.15 కోట్ల సాయం ప్రకటించిన కేజ్రీవాల్ కు తెలంగాణ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేజ్రీవాల్ ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.

అదే విధంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హదరబాదీలను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు. ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి వారి రెండు నెల‌ల జీతాన్ని ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. వీరు మాత్రమే కాకుండా సీఎం సహాయ నిధికి కేసీఆర్ పిలుపుమేరకు మేఘా ఇం జినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థ 10 కోట్ల విరాళం ప్రకటించింది. అదే విధంగా రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంపా నాగేందర్‌, జనరల్‌ సెక్రటరీ మోహన్‌రెడ్డి సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News