సీపీ డీపీతో ఫేక్ వాట్సప్ కాల్.. ప్రజలను భయపెట్టేందుకు సైబర్ కేటుగాళ్ల ఎత్తుగడ
Hyderabad CP DP: హైదరాబాద్ సీపీ డీపీతో ఫేక్ వాట్సప్ కాల్ కలకలం రేపుతుంది.
Hyderabad CP DP: హైదరాబాద్ సీపీ డీపీతో ఫేక్ వాట్సప్ కాల్ కలకలం రేపుతుంది. ప్రజలను భయపెట్టేందుకు సైబర్ కేటుగాళ్లు కొత్త ఎత్తుగడ వేశారు. పాకిస్థాన్ కోడ్‌తో ఉన్న నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయి. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కోరారు.
ఇటీవల సైబర్ నేరగాళ్లు ఇటీవల అక్రమ కేసుల పేరిట ఫేక్ వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం పెరిగిపోయిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులతో పాటు కేసులు రిజిస్టర్ అవడం, ఫోన్ కనెక్షన్‌ను ట్రాయ్ కట్ చేయడం తదితర కారణాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు.