Fraud: డైమండ్‌ బిజినెస్‌ పేరిట టోకరా

Fraud: టోలిచౌకికి చెందిన ఓ బిల్డర్‌కు కుచ్చుటోపీ

Update: 2021-09-23 04:40 GMT

Representational Image

Fraud: సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు హద్దు అదుపులేకుండా పోతోంది. డైమండ్‌ బిజినెస్‌ పేరిట హైదరాబాద్‌ టోలిచౌకికి చెందిన ఓ బిల్డర్‌కు టోకరా వేశారు కేటుగాళ్లు. ఆన్‌లైన్‌లో పరిచయమైన సైబర్‌ నేరగాళ్లు డైమండ్‌ బిజినెస్‌కు సంబంధించి యాప్‌లో డబ్బులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ బాధితుడిని నమ్మించారు. నిజమే అని భావించిన బాధితుడు.. యాప్‌ ద్వారా ముందుగా 50వేలు పెట్టుబడి పెట్టాడు. ఒకేరోజు వెయ్యి రూపాయల ఆదాయం అదనంగా రావడంతో ఆ తర్వాత 43 లక్షలు పెట్టుబడి పెట్టాడు బిల్డర్. తిరిగి డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించి.. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్‌ నేరగాళ్ల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News