స్మగ్లింగ్ కేస్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు.. హర్షకు కస్టమ్స్ అధికారుల నోటీసులు
ఏప్రిల్ 4న విచారణకు రావాలని హర్షరెడ్డికి నోటీసులు
విదేశాల నుంచి బ్రాడెండ్ వాచ్‌ల స్మగ్లింగ్ కేసులో... తెలంగాణకు చెందిన ఓ మంత్రి కొడుకు పేరు వినిపించడం కలకలం రేపింది. సింగపూర్ నుంచి బ్రాండెడ్ వాచ్‌ల స్మగ్లింగ్ కేసులో పొంగులేటి హర్ష రెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పొంగులేటి హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీస్ ఇచ్చినట్టు సమాచారం. ఏప్రిల్ 4న విచారణకు రావాలని హర్షరెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నానని,, ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతాని హర్షరెడ్డి రిప్లై ఇచ్చినట్టు తెలుస్తోంది. హర్షరెడ్డి కోసం ముబిన్ అనే స్మగ్లర్ సింగపూర్ నుండి బ్రాండెడ్ వాచ్‌లు తీసుకొచ్చినట్టు కస్టమ్స్ అధికారులు కేసులో పేర్కొన్నారు. ముబిన్ నుంచి 2 బ్రాండెడ్ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు చెన్నై కస్టమ్స్ అధికారులు. ఒక్కో వాచ్ ధర 1.75 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. వాచ్‌లకు హవాల రూపంలో హర్షరెడ్డి డబ్బులు చెల్లించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.