Crop Damage Compensation: రైతులకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లోకి రూ.10వేలు జమ ..మంత్రి కీలక ప్రకటన
Crop Damage Compensation: రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల అకౌంట్లో త్వరలోనే డబ్బు జమ చేస్తామని వెల్లడించారు. ఎకరాకు రూ. 10, 000చెల్లిస్తామని మంత్రి తెలిపారు.
Crop Damage Compensation: ఈ మధ్యే భారీ వర్షాలు, వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. తెలంగాణలో చాలా వరకు పంటలు వరదలకు గురయ్యాయి. దీంతో పంటలు నష్టపోయిన రైతులకు ఆదుకుని, వారికి బాసటగా నిలించేందుకు తెలంగాణ సర్కార్ ముందుకు వచ్చింది. పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ. 10,000 చొప్పున జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. వరదల కారణంగా రాష్ట్రంలో రూ. 10వేల కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా రైతులు భారీగా నష్టపోయారు. గత పది రోజుల క్రితం కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది. మొత్తం 29 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా గుర్తించారు. అందులో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. పంట నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, పొలాలు, మూగజీవాలు సైతం కొట్టుకుపోయాయి. ఎంతో మంది నిరాశ్రుయులుగా మారారు. వందలాది గ్రాములు ముంపునకు గురయ్యాయి. లక్షలాది మంది బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఇప్పటికే వరద బాధితుల ఖాతాల్లో రూ. 16,500 చొప్పున జమ చేసింది. తాజాగా పంటనష్టం పరిహారంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలు, వరదలతో నష్టపోయినవారికి త్వరలోనే బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని తెలిపారు. బాధితుల ఖాతాలో ఎకరాకు రూ. 10వేల చొప్పున త్వరలోనే జమ చేస్తామని స్పష్టం చేశారు. వరదలతో తెలంగాణ వ్యాప్తంగా రూ. 10వేల కోట్లకు పైచిలుకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. గతంలో కేంద్రం ఇచ్చిన సాయం కాగితాలకే పరిమితం అయ్యిందన్నారు.