Crocodile Spotted In Musi River : హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పుర వద్ద మూసి నది ఒడ్డున గురువారం మధ్యాహ్నం ఒక మొసలి ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఆ మొసలిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే ఇటీవలె కురిసిన వర్షాలకు మూసీలో ఓ మొసలి కొట్టుకువచ్చింది. దాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గురించి స్థానికులు వెంటనే పోలీసులకు తెలిపి వారిని అప్రమత్తం చేసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలియగానే అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆ మొసలిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
హిమయత్ సాగర్ లేదా ఉస్మాన్ సాగర్ నుండి నగరంలో మొసలి ప్రవేశించిందని అధికారులు అనుకుంటున్నారు. ఇక ఆ మొసలిని చూడడానికి వచ్చిన గుంపును నియంత్రించడానికి పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇక పోతే గతంలో కూడా ఇదే విధంగా ఒక మొసలి నిజామాబాద్ ప్రజలలో భయాందోళనలను సృష్టించింది. గత ఏడాది సెప్టెంబరులో మెన్డోరా మండలంలోని దుస్గావ్ గ్రామంలో జాతీయ రహదారి 44 వైపుకు దూసుకెళ్లింది. వర్షాలు కారణంగా గోదావరి ప్రవాహంలో మొసల్లు కొట్టుకువచ్చినట్లు చెబుతున్నారు. అప్పుడు కూడా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ అధికారులకు దానిని పట్టుకుని గోదావరిలోకి విడుదల చేశారు.
గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది ఒడ్డు నుంచి దాదాపు 100 అడుగుల దూరంలో ధర్మశాల అనే ఒక చిన్న గ్రామంలో కూడా ఓ మొసలి దర్శనం ఇచ్చింది. గిరీష్‌జోషి అనే అర్చకుడు ఇంటి ఆవరణలో ఓ మూలన మొసలిని చూసాడు. భయభ్రాంతాలకు గురైన అతను అందరినీ పిలిచి విషయాన్ని తెలిపారు. అది చూసిన ఆ ప్రాంత ప్రజలు కూడా కొంత మేరకు భయబ్రాంతులకు గురయ్యారు. ఇంకా మొసలిని ఆ ప్రాంతంలో సంచరివ్వనిస్తే ఎవరికైనా అపాయం కలిగిస్తుందేమోనని భావించిన కొంత మంది మత్సకారు ఆ మొసలిని చాకచక్యంగా పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు.