సాధారణంగా ఇండ్లలోకి బల్లులు, పిల్లులు, కుక్కలు వస్తుండడం సహజం. ఇవి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు జెర్రులు, పాములు లాంటి విషప్రాణులు కాలనీలలో, ఇండ్లలోకి వస్తుంటాయి. ఆ విషపురుగులు కనిపిస్తేనే చాలు ప్రజలు హడలెత్తి పోయి పరుగులు తీస్తారు. అలాంటిది ఏకంగా మనుషులను మింగే ప్రాణులే ఇండ్లలోకి వస్తే అప్పుడు వారి పరిస్థితి ఏంటి. వారు ఎంతటి భయాందోళనలకు గురవుతారు. ఆలోచిస్తుంటేనే ఒక్కసారిగా భయం వేస్తుంది కదూ.. ఇక నేరుగా ఆ పరిస్థిని ఎదుర్కొన్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అసలు ఏంటి ఏ ప్రాణి, ఎవరి ఇంట్లోకి చొరబడింది అనుకుంటున్నారా. ఒకే అసలు విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో మంగళవారం ఓ మొసలి కలకలం రేపింది. జూరాల కాలువకి చేరువలోనే గ్రామం ఉండడంతో మొసలి మెళ్లిగా జనావాసంలోకి చేరుకుంది. దాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే అప్రమత్తమైన మొసలిని బంధించారు. ఆ తరువాత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం ఇదే విధంగా ఓ కొండ చిలువ కూడా ప్రజల మద్యలోకి వచ్చి కలకలం రేపింది. కొత్తకోట మండలం జాతీయ రహదారి పక్కనే ఉన్న హైలెట్ దాబా వెనకాల పొలంలో ఈ నెల 7వ తేదీన ట్రాక్టర్‌తో దున్నుతుండగా నాగేళ్లకు పెద్ద కొండచిలువ తగిలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణ సాగర్ దాదాపు 13 ఫీట్ల పొడవు 25 కేజీల బరువు ఉన్న పెద్ద కొండచిలువను అతి కష్టం మీద బంధించాడు.