CPI Narayana: ప్రధాని మోడీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు
CPI Narayana: అన్ని హక్కులు కాలరాస్తూ పార్లమెంటును రద్దు చేసేలా చూస్తున్నారు
CPI Narayana: ప్రధాని మోడీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్, చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే ప్రధానిగా మోడీ ఉండలేడన్నారాయన.. మోదీ ప్రధాన మంత్రిగా ఉండడానికి ఒక కాలు చంద్రబాబు, మరో కాలు నితీష్ కుమార్ అని, వీళ్లిద్దరినీ అడ్డు పెట్టుకొని రాజ్యాంగం మార్చాలని చూస్తున్నారని నారాయణ ఆరోపించారు. అన్ని హక్కులను కాలరాస్తూ పార్లమెంటును రద్దు చేసేలా చూస్తున్నారని విమర్శించారు.. వన్ నేషన్... వన్ ఎలక్షన్.. చట్ట ప్రకారం సాధ్యం కాదని, టు బై థర్డ్ పార్లమెంట్ సభ్యులు ఒప్పుకోవాలన్నారాయన.... ప్రస్తుతం హైదరాబాదులో హైడ్రా అందరినీ వేధిస్తున్న సమస్య అన్నారు.
భూగర్భజలాలు పెరగాలన్నా... కాలుష్యం నివారించాలన్నా... చెరువులు అవసరమని, మొదటగా నాలాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు నారాయణ. మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని ఖరాఖండి చెప్పారు.. ముందు పేదవాళ్లకు ప్రత్యామ్నాయం చూపించిన తరువాత వారి ఇళ్లను ఖాళీ చేయించాలని, ఆక్రమణలు జరిగిన చోట కచ్చితంగా కూల్చివేయాల్సిందేనని. ఎఫ్‌టీఎల్ పరిధిలోని కమర్షియల్ భవనాలను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు.