Cyber Crimes In Hyderabad :గూగుల్ ప్రతినిధులతో సీపీ సజ్జనార్ వీసీ

Update: 2020-09-24 13:58 GMT

Cyber Crimes In Hyderabad : టెక్నాలజీ పెరుగుతున్న కొలది నగరాల్లో  సైబర్ నేరాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కాల్స్ ద్వారా, ఎస్ఎంఎస్ ల ద్వారా ఈ మెయిల్స్ ద్వారా, అదే విధంగా కొత్త కొత్త యాప్ లతో కూడా సైబర్ నేరగాల్లో అమాయకప్రజలను మోసం చేస్తున్నారు. ఒకసారి ఉపయోగించిన ట్రిక్ ని మరోసారి ఉపయోగించకుండా మార్చి మార్చి ప్లాన్ లను ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలు కూడా సైబర్ నేరగాల్ల చేతిలో మోసపోయిన తరువాత గానే మేలుకోవడం లేదు.

ఈ క్రమంలోనే సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఇంటర్నెట్ దిగ్గజం అయిన గూగుల్‌ ప్రతినిధులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూట్యూబ్‌లో అభ్యంతరకర వీడియోలు పోస్ట్‌ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సీపీ వారికి సూచించారు. సైబర్ నేరాలను తగ్గించడానికి, సైబర్‌ నేరగాళ్ల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సైబర్ నేరాల విషయంలో పోలీసులకు గూగుల్ సాంకేతిక టీమ్ సహకరించాలని ఆయన కోరారు. కొంత మంది సైబర్ నేరగాల్లు గూగుల్‌‌కు చెందిన వివిధ సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారని సజ్జనార్ వెల్లడించారు. గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్, గూగుల్ యాడ్స్ సర్వీసెస్, గూగుల్ వ్యూ ఫామ్‌ల ద్వారా అమాయక ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూగుల్ ప్రతినిధులు గీతాంజలి దుగ్గల్, సునీతా మొహంతీ, దీపక్ సింగ్‌ పాల్గొన్నారు.

Tags:    

Similar News