కరోనా వ్యాక్సిన్ల వినియోగంపై ఆధునిక నిఘా
దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణికీ సర్వం సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణికీ సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు టీకాలు చేరుకున్నాయి. వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా నిర్దేశిత టెంపరేచర్ ఉంచడానికి, వాటిని హైదరాబాద్‌లోని కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పర్యవేక్షించడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబందిచి అన్ని సదుపాయాలు కల్పించింది. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర వ్యాక్సిన్ కేంద్రాల నుంచి రీజినల్ సెంటర్లకు టీకాలు తరలిపోయాయి. రీజనల్ వ్యాక్సిన్ సెంటర్ల నుంచి అన్ని జిల్లాలకు వెళ్తాయి. అక్కడి నుంచి గురువారం సాయంత్రానికి అన్ని టీకా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో వ్యాక్సిన్లు వెళ్తాయి. ఆ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. పటిష్టమైన భద్రత నడుమ టీకాలను తరలించాంమని ఆయన చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ రాష్ట్ర ప్రజలందరికీ ఒకేసారి వేయాల్సి వచ్చినా.. నిల్వ చేసే సామర్థ్యం మన ఉంది. వ్యాక్సిన కేంద్రాల్లో 88 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం.. దాదాపు కోటిన్నర డోసులు నిల్వ చేసే కేపాసిటి ఉంది. కోటిన్నర డోసులు జిల్లా కేంద్రాల్లో నిల్వ చేసే సామర్థ్యం ఉంది. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలల్లో మరో కోటి వ్యాక్సిన్లను నిల్వ చేయవచ్చు. అలా మొత్తం 4 కోట్ల వ్యాక్సిన్లను నిల్వ చేయవచ్చు. కోవిన్ టెంపరేచర్ లాగర్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ చేయవచ్చు.. కోవిన్ టెంపరేచర్ లాగర్ వ్యవస్థనే కోల్డ్ సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్ అంటారు. రిఫ్రిజిరేటర్ కూలింగ్ స్థాయిలోనే కరోనా టీకాలను నిల్వ చేయవచ్చు. రెగ్యులర్‌గా యాంటీ రేబిస్, ఇన్సులిన్లు, ఇతర వ్యాక్సిన్లను కూడా నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా 50 లక్షల ఆటో డిసేబుల్ (ఏడీ) సిరంజీలు తెప్పిస్తున్నామని వెల్లడించారు.