Covishield Vaccine Expiry Date: కరోనా వ్యాక్సిన్ ఎక్స్‌పైరీ డేట్ ఎప్పటి వరకంటే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కరోనా వ్యాక్సిన్ రానే వచ్చింది. సీ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కరోనా వ్యాక్సిన్ రానే వచ్చింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా పంపిణీ మొదలైంది. రెండు మూడు రోజుల్లో టీకా వేసేందుకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వాదేశాలు మేరకు కోవిడ్ టీకా ప్రజలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేయనున్నాయి. కొవిషీల్డ్ టీకాను 2020, నవంబర్ 1వ తేదీన సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసింది.
అయితే కరోనా టీకా తరయారీ కాలపరిమితి ముగిసే తేదీ(ఎక్స్‌పైరీ డేటు)తో పాటు బ్యాచ్ నంబర్‌ను కచ్చితంగా ముద్రిస్తారు. అయితే కరోనా నివారణకు సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ టీకా అందుబాటులోకి వచ్చింది. ఈనెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి 3.64 లక్షల డోసుల వ్యాక్సిన్ నిన్న చేరింది. ఈ టీకా కాలపరిమితి 2021, మార్చి 29వ తేదీ వరకు ఉంటుంది. మొత్తం 31 బాక్సుల్లో నిల్వ చేసిన 3.64 లక్షల డోసులు కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ స్టోర్‌లో నిల్వ ఉంచారు.
బహిరంగ మార్కెట్ లోనూ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఒక్కో వ్యాక్సిన్ డోసును వెయ్యి రూపాయలకు విక్రయించనుంది సీరమ్ సంస్థ. అవసరం ఉన్న వారు మార్కెట్ లో ఈ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అటు విదేశాల్లో కూడా కొవిషీల్డ్‌కు భారీగా డిమాండ్ ఉండటంతో నెలకు 70 నుంచి 80 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది సీరమ్.