COVID-19: హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్.. మళ్లీ కంటైన్మెంట్ జోన్లు..
COVID-19: గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ చర్యలకు ఉపక్రమించింది.
COVID-19: గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ చర్యలకు ఉపక్రమించింది. నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్మెంట్ జోన్లను బల్దియా ఏర్పాటు చేసింది. జంట నగరాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా చర్యల్లో భాగంగా ఈ మినీ కంటైన్మెంట్ జోన్ల పరిధిలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో నిరంతరం శానిటైజేషన్‌తో పాటు వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. ఒక్క ఏరియా పరిధిలో 5 కేసుల కంటే ఎక్కువగా ఉంటే మినీ కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్లో కరోనా కేసులు వస్తే హౌజ్ క్లస్టర్లుగా బల్దియా ఏర్పాటు చేస్తోంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు శానిటైజేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. జంట నగరాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు సోడియం హైపోక్లోరైట్ స్ప్రేయింగ్ చేస్తున్నారు. హై రిస్క్ ప్రాంతాల్లో ఇంటెన్సివ్ శానిటేషన్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేస్తున్నారు.