Coronavirus - Viral Fever: ఒక వైపు కరోనా... మరోవైపు వైరల్ ఫీవర్లు...
Coronavirus - Viral Fever: * రోజురోజుకు పెరుగుతున్న డెంగ్యూ కేసులు * అప్రమత్తమైన వైధ్యాధికార యంత్రాంగం
Coronavirus - Viral Fever: ఒక వైపు కరోనా.. మరోవైపు వైరల్ ఫీవర్లు, దానికి తోడు డెంగ్యూ విజృంభిస్తోంది. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక జ్వరంతో బాధపడుతున్నవారే. వీటి లక్షణాలు ఒకేలా ఉండటం మరింత గందరగోళానికి దారితీస్తోంది. వర్షాల కారణంగా అక్కడక్కడ నిలిచిన మురికి నీటి వల్ల దోమలు పెరిగిపోతున్నాయి. వీటితో విషజ్వరాలు వస్తుండడంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతున్న క్రమంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో ఉన్న ఆసుపత్రుల్లో బెడ్స్ అన్ని నిండిపోయాయి. ప్రస్తుతం వైరల్ ఫివర్స్ కూడా కారోనా లక్షణాలు అనుకోని సొంత వైద్యం చేసుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే సొంత వైద్యం వల్ల అనేక సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలంలో వచ్చే జబ్బులకు చాలావరకు నీరు, ఆహారం కలుషితం కావటం, దోమలు కుట్టటం, గాలి ద్వారా ఇన్ ఫెక్షన్లు వ్యాపించటమే కారణం. ఇవన్నీ నివారించుకోదగినవే. దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా బారినపడకుండా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.