తెలంగాణలో కొత్తగా 2,534 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-09-10 03:55 GMT

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,534 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 2,071 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,176కి చేరింది. మృతుల సంఖ్య 927కి పెరిగింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,17,143కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,106 యాక్టివ్‌ కేసులు ఉండగా అందులో 25,066 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతం ఉండగా, దేశంలో 1.68 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ చెప్పింది. అలాగే రికవరీ రేటు 78శాతంగా ఉందని, ఇది దేశ సగటు (77.83) కంటే ఎక్కువని పేర్కొంది. బుధవారం ఒకే రోజు 63,017 శాంపిల్స్‌ పరీక్షించగా.. ఇప్పటి వరకు 19,53,571 నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది. ఇంకా 2,447 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 52,619 మందికి టెస్టులు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.



 


Tags:    

Similar News