Coronavirus Updates in Telangana: తెలంగాణలో వరుసగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 1850..
Coronavirus Updates in Telangana: తెలంగాణలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. శనివారం కొత్తగా 1850 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి
Coronavirus Updates in Telangana: తెలంగాణలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. శనివారం కొత్తగా 1850 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,312కు చేరగా.. కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 5 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 288కు చేరింది. శనివారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1572 కేసులు వచ్చాయి. ఇక మిగిలిన కేసులు రంగారెడ్డి జిల్లాలో 92, మేడ్చల్ జిల్లాలో 53, కరీంనగర్ జిల్లాలో 18 వరంగల్ అర్బన్ 31 , న్సల్గొండ జిల్లాలో 10 నిజామాబాద్ జిల్లాలో 17 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
కొత్తగా 1342 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 11,537 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 10,487 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. శనివారం కొత్తగా 6,427 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,10,545 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే శుక్ర , శని వారాల్లో కరోనా నుంచి కోలుకొని పెద్ద సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. శుక్రవారం ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు చెందిన కరోనా పరీక్షల్లో అనుమానాలు ఉండటంతో లెక్కలోకి తీసుకోలేదు.