Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1278 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-07-10 17:18 GMT
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1278 కరోనా పాజిటివ్ కేసులు
  • whatsapp icon

Coronavirus Updates in Telangana: తెలంగాణ లో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం కొత్తగా రాష్ట్రంలో 1278 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 8 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 339 కు చేరింది. శుక్రవారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 762 కేసులు వచ్చాయి. ఇవాళ 1,013మంది వైరస్ ‌నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 19,205 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12,680 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

ఇవాళ ఒక్క రోజే రాష్ట్రంలో 10,354 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 60 శాతం డిశ్చార్జి కాగా.. 39 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా, ఒక శాతం మరణాలు నమోదైటనట్లు పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల్లో 83 శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ లేవని, కేవలం నాలుగు శాతం మందిలోనే తీవ్ర లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.



 


Tags:    

Similar News