Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,269 కరొనా పాజిటివ్ కేసులు నమోదు

Coronavirus Updates in Telangana: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.. ఇక ఆదివారం కొత్తగా రాష్ట్రంలో 1,269 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి.

Update: 2020-07-12 16:05 GMT

Coronavirus Updates in Telangana: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.. ఇక ఆదివారం కొత్తగా రాష్ట్రంలో 1,269 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,671 కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 8 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 356 కు చేరింది. గురువారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 800 కేసులు వచ్చాయి.

ఇక మిగిలిన జిల్లాలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 94, కరీంనగర్ జిల్లాలో 23, సంగారెడ్డిలో 36, వరంగల్ అర్బన్ 12, నిర్మల్, జగిత్యాల్ 4, యదాద్రి 7, మహాబుబా బాద్ 8, పెద్దపల్లి 9, మెదక్ 14, మహబూబ్ నగర్ 17, మంచిర్యాల్ , కొత్తెగుడం, రాజన్న సిరిసిల్లాలో మూడు కేసులు, నల్గొండ 15, ఆదిలాబాద్ 4, వికారాబాద్ 6, నాగూర్ కర్నూల్ 23, జనగాం 6, నిజామాబాద్ 11, వనపర్తి 15, సిద్దిపేట 3, గద్వాల్, సూర్యాపేటలలో 7, ఖమ్మంలో ఒక్కో కేసు నమోదు అయినట్టుగా ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.

ఇక కొత్తగా 1,563 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 22,482 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,833 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఇక గురువారం కొత్తగా 8,153 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,70, 324 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే గత వారం రోజులుగా కరోనా నుంచి కోలుకొని పెద్ద సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది.

కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది. 




Tags:    

Similar News