తెలంగాణలో కొత్తగా 11 పాజిటివ్ కేసులు.. ఒక్క హైదరాబాదులోనే రికార్డు స్థాయిలో..
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఇవాళ కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో 1001 చేరింది. కరుణ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 316 కాగా.. ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి 25 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో 660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన అత్యధిక కేసులు ఒక్క హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. హైదరాబాదులో 540 కేసులు నిర్ధారణ అయ్యాయి.
జిల్లాల వారీగా కేసుల సంఖ్య చూస్తే
హైదరాబాద్ 540, సూర్యాపేటలో 83, నిజామాబాద్ 61 , గద్వాల్ 45, వికారాబాద్ 37 , రంగారెడ్డి జిల్లాలో 33, వరంగల్ అర్బన్ 27 , మేడ్చల్ 22, నిర్మల్ 20, కరీంనగర్ 19, నల్లగొండ 17, కామారెడ్డి 12 , మహబూబ్ నగర్ 11, ఖమ్మం 8, సంగారెడ్డి 7 , అసిఫాబాద్ 7, మెదక్ 5 , భూపాలపల్లి 4, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి లో మూడేసి కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట, మహబూబ్ నగర్, మంచిర్యాల నారాయణపేటలో ఒక్కో కేసు నమోదయింది. వనపర్తి, యాదాద్రి, వరంగల్ రూరల్ కోవిడ్ ఫ్రీ జిల్లాలుగా వున్నాయి