Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,640 కరోనా కేసులు నమోదు!

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా

Update: 2020-07-24 16:41 GMT
three districts in ap recorded the highest corona cases

Coronavirus updates in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1,640 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 52,466 కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 11,677 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 40,334 కి చేరుకుంది. ఇక ఇవ్వాలా ఎనమిది మంది కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 455 కి చేరుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 15,367 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 3,37, 771కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కరోనా కేసులలో ఒక్క GHMC పరిధిలో 683 కేసులు వచ్చాయి. ఇక మిగతా జిల్లాల కేసుల విషయానికి వచ్చేసరికి రంగారెడ్డి 135, మేడ్చెల్ 30, సంగారెడ్డి 102, వరంగల్ అర్బన్ 36, కరీంనగర్ 100,జగిత్యాల 17, మహబూబబాద్ 44, మహబూబ్ నగర్ 11, భూపాలపల్లి 24, నల్గొండ 42, నిజామాబాద్ 18, నాగూర్ కర్నూల్ 52, సూర్యాపేట 11, జనగామ 10, సిద్దిపేట 08, మెదక్ 22, గద్వాల్ 7, పెద్దపెల్లి 98, ఖమ్మం 13, వరంగల్ రూరల్ 22, సిరిసిల్లా 20, ఆదిలాబాద్ 09, ములుగు 14, వనపర్తి 18, భద్రాది 11, కామారెడ్డి56, మంచిర్యాలలో 7, వికారాబాద్ 8, నిర్మల్ లో ఒక్కో కేసు నమోదు ఆయునట్టుగా శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది.

ఇదిలావుంటే గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకొని వారు పెద్ద సంఖ్యలో ఉండడం సంతోషాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది. 




 


Tags:    

Similar News