Telangana: ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే తెలంగాణ మరో మహారాష్ట్ర అవుతుంది: శ్రీనివాస్

Telangana: తెలంగాణలో గత 4 వారాలుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్ శ్రీనివాస్‌ అన్నారు.

Update: 2021-04-14 14:51 GMT

Telangana: తెలంగాణలో కరోనా కరాళ నృత్యం.. మరో మహారాష్ట్ర కావొచ్చంటూ వైద్యశాఖ హెచ్చరికలు

Telangana: తెలంగాణలో గత 4 వారాలుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్ శ్రీనివాస్‌ అన్నారు. మరో 6 వారాల పాటు పరిస్థితులు ఇలాగే ఉంటాయని హెచ్చరించారు. వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ మరో మహారాష్ట్ర అవుతుందన్నారు. ఇంట్లో ఒకరికి కరోనా ఉంటే గంటలోపే మిగతా వారికి వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ పెట్టడం లేదని కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెడ్స్‌ సరిపోక కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

Tags:    

Similar News