Coronavirus: ఊర్లనూ చుట్టేస్తున్న మహమ్మారి
Coronavirus: జిల్లాల్లోనే 80శాతం కరోనా కేసులు * ఒక్కరోజే 33 మంది మృతి..
Coronavirus: తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. వందల మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఫస్ట్ వేవ్‌లో పట్టణాలను వణికించిన కరోనా.. ఇప్పుడు జిల్లాలను చుట్టేస్తోంది. ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు ఉండేవి.. కానీ, ఇప్పుడు అంతకుమించి కేసులు జిల్లాల్లో గ్రామాల్లో నమోదు అవుతున్నాయి. ప్రతి పల్లెలోకి మహమ్మారి చొచ్చుకుని పోయింది.
ఫస్ట్ వేవ్‌లో 20 శాతం కేసులు రూరల్‌లో, 80శాతం కేసులు అర్భన్ ఏరియాల్లో రాగా, ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. 20శాతం కేసులు అర్బన్‌లో వస్తే, 80 శాతం జిల్లాల్లో నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మహబూబ్‌నగర్, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఆయా జిల్లాల్లో టెస్టు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో సగటున 20 మంది పాజిటివ్‌గా నిర్దారణ అవుతోంది. దాంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు..