Coronavirus: తెలంగాణలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్
Coronavirus: తెలంగాణలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాఠశాలలే టార్గెట్‌గా మహమ్మారి విజృంభిస్తోంది.
Coronavirus: తెలంగాణలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాఠశాలలే టార్గెట్‌గా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో 35 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపితే.. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలోని జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు మహమ్మారి బారిన పడ్డారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ శర్మన్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు భరోసా కల్పించారు.
మరోవైపు కరోనా సోకిన విద్యార్థినుల తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్న కలెక్టర్ ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థుల కంటే ఎక్కువ మందిని కూర్చోపెట్టకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డిని ఆదేశించారు. పాఠశాలలో మొత్తం 560మంది విద్యార్థినులు చదువుతున్నట్లు ప్రన్సిపల్ కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆదేశాలతో తరగతి గదుల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజేషన్ చేపట్టారు.