Vaccination: తెలంగాణలో వ్యాక్సినేషన్ కొరత
Vaccination: కేంద్రం నుంచి వ్యాక్సిన్ అందక ఆగిన ప్రక్రియ * రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిలిచిపోయిన వ్యాక్సినేషన్
Vaccination: తెలంగాణలో వ్యాక్సినేషన్ కొరత వెంటాడుతోంది. ఇప్పటికే వ్యాక్సినేషన్స్ సెంటర్స్‌లో వ్యాక్సిన్ షార్టేజ్ తో జనం కంగారు పడుతున్నారు. ఇంతకీ రాష్ట్రానికి ఎంత వ్యాక్సిన్ వచ్చింది అసలు ఎంత మందికి వ్యాక్సినేషన్ జరిగింది.
కేంద్రం నుండి వ్యాక్సిన్ అందుబాటిలోకి రాక తెలంగాణలో కొరత ఏర్పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం టీకా ప్రక్రియను నిలిపివేశారు. ఖచ్చితంగా వ్యాక్సిన్ సరిపడా పంపకపోతే ఇబ్బందులు తప్పవని వైద్యులు అంటున్నారు. వ్యాక్సిన్ వేసుకునే వారు రోజు రోజుకి పెరుగుతున్నారని గతం కంటే ఇప్పుడు వ్యాక్సిన్ వెసుకునే వారిలో అవగాహన పెరిగిందని మెడికల్ ఆఫీసర్లు అంటున్నారు.
ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతోంది. మరో వైపు వ్యాక్సిన్ కొరత వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నుండి సరైన ఆదరణ రాకపోతే మొదటి డోస్ తీసుకున్న వారికి రెండవ డోస్ దొరకక ఇబ్బందులు పడతారని వైద్యులు అంటున్నారు.