Dr Victor Emmanuel: కేవలం రూ.10 ఫీజుతో కరోనాకు వైద్యం

Dr Victor Emmanuel: కరోనా సోకిన వారిని బతికించుకోవడం కోసం ఆస్తులు అమ్మి లక్షల రూపాయలు హాస్పిటళ్లలో ఫీజులు చెల్లిస్తున్నారు.

Update: 2021-05-26 05:50 GMT

డాక్టర్‌ విక్టర్‌ ఇమాన్యుల్ (ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Dr Victor Emmanuel: కరోనా సోకిన వారిని బతికించుకోవడం కోసం ఆస్తులు అమ్మి లక్షల రూపాయలు హాస్పిటళ్లలో ఫీజులు చెల్లిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అత్యాశ లేకుండా సేవ దృక్పథంతో కరోనా రోగులకు పది రూపాయలకే చికిత్స అందిస్తున్నారు ఓ వైద్యుడు. సేవే లక్ష్యం.. సేవే మార్గం అంటూ చికిత్సతో పాటు కరోనా రోగుల్లో ధైర్యాన్ని నింపి బాసటగా నిలుస్తున్న ఆ వైద్యుడు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్టోరీ చూడండి.

కరోనా సోకి ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే చుక్కలు చూడాల్సిందే. ప్రాణం పోతుందనే భయంతో లక్షల ఫీజులు నైనా చెల్లిస్తున్నారు. కానీ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని ఈ డాక్టర్ మాత్రం పది రూపాయలకే కరోనా చికిత్స అందిస్తున్నారు. పేద కరోనా పేషెంట్లను ఆదుకుంటున్న ఈయన పేరు డాక్టర్‌ విక్టర్‌ ఇమాన్యుల్. రేషన్ కార్డు ఉంటే 10 రూపాయలు లేకపోతే 200 రూపాయలు తీసుకుంటారు. కొంతమంది దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోరు.

డాక్టర్ ఇమాన్యుల్ ఇప్పటి వరకు వేలాది మంది రోగులకు మెరుగైన వైద్యం అందించి కరోనా విపత్తులోనూ నిరుపేదలకు బాసటగా నిలుస్తున్నారు. చికిత్స ఒకటే కాదు వారిలో మనోధైర్యం నింపడానికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులను ఫిర్జాదిగూడలో ఉచిత ఐసోలేషన్ సెంటర్‌కి తరలిస్తారు. ఇక పేషంట్ సీరియస్‌గా ఉంటే గాంధీ హాస్పిటల్ కి రిఫర్ చేస్తామని తెలిపారు.

ట్రీట్‌మెంట్‌ కోసం ప్రజ్వల ఆసుపత్రికి వచ్చిన రోగులు డాక్టర్ ఇమ్మన్యుయల్ ని మనుషుల్లో దేవుడుగా అభివర్ణిస్తున్నారు. తక్కువ ఫీజుతో మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్ విక్టర్ ఇమాన్యుల్ సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News