Corona Effect: వివాహం, శుభకార్యాలపై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్
Corona Effect: ఆగిపోయిన పెళ్లిళ్లు.. ఇతర వేడుకలు * వైరస్ భయంతో వాయిదా వేసుకుంటున్న జనం
Corona Effect: వివాహం, శుభకార్యాలపై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పిడుగులా పడింది. శుభకార్యాలు జరిగితే వందలాది మందికి పని దొరుకుతుంది. లాక్‌డౌన్ కారణంగా శుభకార్యాలు వాయిదా పడటంతో విభిన్న వర్గాలపై తీవ్ర ప్రభావం పడింది. ఫంక్షన్ హాళ్లు, ఫొటోగ్రాఫర్లు, క్యాటరింగ్.. ఇలా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు.
లాక్‌డౌన్ కారణంగా లగ్గాలతో పాటు ఇతర ఫంక్షన్లు నిలిచిపోయాయి. దీంతో రెండు నెలలుగా దమ్మిడి సంపాదన లేక పూటగడవడం కష్టంగా మారి.. కొందరు పండ్ల అమ్ముకుంటున్నారు.
కరోనాతో శుభకార్యాలకు డెకరేషన్ చేసే వారి పరిస్థితి దయానీయనంగా మారింది. మహమ్మారి కాటుతో జీవనం దుర్బరంగా తయారైంది. కరోనా మహమ్మారి ముళ్ల కంచెలా చుట్టుముట్టడంతో... అనుకూల ముహూర్తాలు ఉన్నా వెనుకడుగు వేయక తప్పలేదు. దీంతో ఫంక్షన్ హాల్ నిర్వహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
వివాహానికి సంబంధించిన ప్రతి రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. వారి జీవితాల్లో మళ్లీ కల రావాలంలే... ఫంక్షన్ హల్స్‌ల్లో లైట్స్ వెలగాలి, పెళ్లి ఇంటికి తోరనాలు కట్టాలి. అప్పుడే వారు మూడు పూటల భోజనం చేయగలుగుతారు.