Coronavirus Recovered Patient Died: కరోనా తగ్గింది తెల్లారితే డిశ్చార్జ్.. అంతలోనే ఘోరం..
Corona Recovered Patient Died: కరోనా మహమ్మారి సోకిందంటే చాలు బాధితులు కోలుకునేంతవరకు క్షణం ఒక యుగంలా గడుస్తుంది.
Coronavirus Recovered Patient Died With Heart Attack: కరోనా మహమ్మారి సోకిందంటే చాలు బాధితులు కోలుకునేంతవరకు క్షణం ఒక యుగంలా గడుస్తుంది. మంచి చికిత్స తీసుకుని త్వరగా కోలుకుంటే వారికి అది పునర్జణ్మతో సమానంగా భావించి సంతోషంగా ఆస్పత్రుల నుంచి ఇంటికి వెళ్తుతున్నారు. అలా ఆరోగ్యంగా తిరిగి వెళ్లిన వారికి వారి వారి కుటుంబ సభ్యులు కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. అవధులు లేని ఆనందంతో స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలోనే ఓ 50 ఏళ్ల వ్యక్తి కరోనా మహమ్మారి బారిన పడి వైద్యులు అందించిన చికిత్సతో కోలుకున్నాడు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పరిపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులంతా తెల్లవారితే ఇంటి పెద్ద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వస్తారు, ఆయనకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలనుకన్నారు. బాధితుని కుమారుడు కూడా వీడియో కాల్ ద్వారా అతనితో రాత్రి చాలానే సేపు సంభాషించారు. ఎన్నో ఆనందాలను పంచుకున్నారు. కానీ తెల్లవారేసరికే ఘోరం జరిగింది. గుండెపోటుతో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అతని కుటుంబ సభ్యుల ఆనందం పూర్తిగా ఆవిరైపోయింది.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే యాచారం మండలం నజ్దిక్‌సింగారానికి చెందిన వ్యక్తి(55)కి కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అతను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం చేరాడు. ప్రతి రోజు తన ఆరోగ్యం గురించి పూర్తి సమాచారాన్ని బాధితుడు వీడియో కాల్ చేసి ఇంట్లో వారికి తెలిపేవాడు. ఇదే విధంగా శనివారం రాత్రి కూడా బాధితుడు అతని కుమారుడికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆదివారం వైద్యులు అతన్ని డిశ్ఛార్జి చేస్తున్నట్లు సమాచారం అందించారు. కానీ ఇంతలోనే అతన్ని మృత్యువు కబలించింది. గుండెపోటుతో ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది అతని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని విన్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రాత్రి తమతో హుషారుగా మాట్లాడిన వ్యక్తి లేడన్న చేదు నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆసుపత్రి బిల్లు రూ.8లక్షలు వేశారని అదే అతని గుండెపోటుకు కారణమై ఉంటుందని దగ్గరి బంధువులు చెబుతున్నారు.