Corona Infected Dead Body Moved In An Auto: ఆటోలో కరోనా మృతదేహం తరలింపు..

Corona Infected Dead Body Moved In An Auto: కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించారు. నిబంధనలు ప్రకారం కరోనాతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి జాగ్రత్తగా తరలించాలి.

Update: 2020-07-11 13:36 GMT
corona Infected Dead Body Moved In An Auto In Nizamabad

Corona Infected Dead Body Moved In An Auto: కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించారు. నిబంధనలు ప్రకారం కరోనాతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి జాగ్రత్తగా తరలించాలి. ప్రభుత్వ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల మధ్య మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ లో మాత్రం దీనికి విరుద్దంగా జరిగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని ఆటోలో నిర్లక్ష్యంగా తరలించారు నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు. ఆటోలో కాళ్లు పెట్టుకునే చోట కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృత దేహాన్ని పూర్తిగా ప్యాకింగ్ చేసి శ్మశాన వాటికకు తరలించారు.

అంతే కాదు ఇంకా దారుణం ఏంటంటే డ్రైవర్‌తో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తి కూడా పీపీఈ కిట్లు ధరించలేదు. శవాన్ని తరలించే సమయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపడం మాత్రమే కాదు పలు అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ సంఘటనపై ఆస్పత్రి వర్గాలను ప్రశ్నించగా ఆస్పత్రిలో ఒకేసారి ముగ్గురు కరోనా బాధితులు మరణించారని తెలిపారు. దీంతో వారి మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్ లేకపోవడం వల్ల తరలింపు సాధ్యం కాలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అందుకే ఆటో మాట్లాడి అందులో కరోనా మృతదేహాన్ని శ్మశానానికి తరలించినట్లు పేర్కొన్నారు.

ఇక పోతే తెలంగాణలో శుక్రవారం 1278 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 8 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 339 కు చేరింది. శుక్రవారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 762 కేసులు వచ్చాయి. ఇవాళ 1,013మంది వైరస్ ‌నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 19,205 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12,680 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 10,354 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 60 శాతం డిశ్చార్జి కాగా.. 39 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా, ఒక శాతం మరణాలు నమోదైటనట్లు పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల్లో 83 శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ లేవని, కేవలం నాలుగు శాతం మందిలోనే తీవ్ర లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.

Tags:    

Similar News