Central Team Praised Telangana Govt: కరోనా కట్టడిలో తెలంగాణ కృషి అభినందనీయం: కేంద్ర బృందం
Central Team Praised Telangana Govt: కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర బృందం అభినందించింది. హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న పేషంట్ ల కోసం రూపొందించిన 'హితం' యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని ప్రశంసించింది.
Central Team Praised Telangana Govt: కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర బృందం అభినందించింది. హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న పేషంట్ ల కోసం రూపొందించిన 'హితం' యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని ప్రశంసించింది. హితం యాప్ ను ఇతర రాష్ట్రాలతో పంచుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించిన కేంద్ర బృందం సోమవారం ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో బిఆర్కే భవన్‌లో సమావేశమైంది.
సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ... కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి కోవిడ్-19 టెస్ట్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కరోనా తీవ్రత ను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. రాష్ట్రంలో కరోనా ను అదుపు చేయడానికి తీసుకుంటున్న చర్యలు, పేషంట్లకు అందిస్తున్న వైద్యం సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.
'మొదటి నుండి కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం సమన్వయం తో పని చేస్తున్నాము.ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రజల ప్రాణాలు రక్షించండానికి 24 గంటల పాటు శ్రమిస్తున్నాము. రాష్ట్రంలోని ఆసుపత్రిలలో కరోనా చికిత్సకు సిద్ధమైన విధానము వ్యాప్తిని అరికట్టే చర్యలు పేషేంట్ లకు అందిస్తున్న చికిత్స చర్యలు చాలా సంతృప్తికరంగా ఉందని వీకే పాల్ అన్నారు. కేంద్ర బృందం కరోనా పరీక్షలు, చికిత్స లపై సంతృప్తి వ్యక్తం చేసింది.కేంద్ర బృందం గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ నివారణ చర్యల పై సూచనలు చేసింది.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మాద్యే జరిగింది క్యాబినెట్ సమావేశంలో రోజుకు 40 వేల పరిక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కోవిడ్ కట్టడి కి ప్రత్యేక నిధులు మంజూరు చేశార'ని సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశంలో కేంద్ర బృందానికి తెలిపారు.