Containment Zones in Hyderabad: హైదరాబాద్ లో కంటైన్మెంట్ జోన్లు ఇవే!
Containment Zones in Hyderabad: హైదరాబాదులోని కంటైన్మెంట్ జోన్లు వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం హైదరాబాదులో 92 కంటైన్మెంట్
Containment Zones in Hyderabad: హైదరాబాదులోని కంటైన్మెంట్ జోన్లు వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం హైదరాబాదులో 92 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం చార్మీనార్ జోన్ లో అత్యధికంగా 31 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఆ తర్వాత సికింద్రాబాద్ లో 23, ఖైరతాబాద్ లో 14, శేరిలింగంపల్లి 10, కూకట్ పల్లిలో 9, ఎల్బీ నగర్ లో 5, కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్టుగా పేర్కొంది. ఇక చార్మీనార్ జోన్ లోని చాంద్రాయణగుట్ట సర్కిల్ లో అత్యధికంగా తొమ్మిది కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్టుగా తెలిపింది. అలాగే మే నెలలో కరోనా హాట్‌స్పాట్‌గా మారిన మలక్‌పేట సర్కిల్‌లో ప్రస్తుతం 6 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లుగా వెల్లడించింది. అయితే ఎన్ని కేసులుంటే వాటిని కంటైన్మెంట్ జోన్లుగా పరిగణిస్తారు అన్న దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక తెలంగాణలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 1,610 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనను వెల్లడించింది. ఇక కరోనాతో మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 57,142కి చేరుకుంది. ఇక అటు మృతుల సంఖ్య 480కి పెరిగింది. కరోనా నుంచి తాజాగా 803 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 42,909కి చేరుకుంది. ప్రస్తుతం 13,753 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ర్టంలో ఇప్పటి వరకు 3,79,081 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.